![]() |
![]() |
.webp)
గోపీచంద్ నటిస్తున్న మూవీ భీమా..ఈ మూవీ ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. అలాగే బుల్లితెర మీద ఆలీతో సరదాగా సీజన్ 1 పూర్తి చేసుకుని సీజన్ 2 లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ షోలో మొదటిగా గోపీచంద్ ని ఇంటర్వ్యూ చేసి ఎన్నో ప్రశ్నలు అడిగారు ఆలీ. "హీరోలు విలన్స్ గా చేస్తున్న రోజులే.. ఐతే గౌతమ్ నంద మూవీలో అలాంటి రోల్ చేసాను.. ఒక టైములో రాజశేఖర్ గారు చేసిన నెగటివ్ షేడ్ ఆఫ్ ది హీరోగా చేయాలనీ ఉంది. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మూవీస్ లో నాకు విలన్ గా ఆఫర్ వస్తే కచ్చితంగా చేస్తాను. హిందీ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి కానీ..తెలుగులోనే చేసుకోవడం బెటర్ అని..నేను ఇష్టపడి చదువుకోవాలి అనుకునే పిల్లలకు సాయం చేస్తుంటాను. అది ఇష్టంతో చేసేటప్పుడు చెప్పుకోకూడదు. నాకు చదువుకునే వాళ్లకు ఎందుకు హెల్ప్ చేయాలనీ అనిపిస్తుంది అంటే మా నాన్నకు ఒక స్కూల్ పెట్టాలనే కోరిక ఉండేది. మమ్మల్ని చదివించేటప్పుడు ఒంగోలులో, చెన్నైలో చాలా ప్లేసెస్ తిరిగారు కానీ ఎక్కడా ఆయనకు నచ్చలేదు.
అందుకే ఆయనే ఒంగోలులో నిల్ డెస్పెరాండం అనే స్కూల్ పెట్టి అందులో నన్ను, అన్నయ్యని, చెల్లిని ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ని పెట్టి చెన్నై నుంచి టీచర్స్ ని పిలిపించి చదివించారు..ఇప్పుడు వాళ్లంతా మంచి పొజిషన్స్ లో ఉన్నారు. నాన్న చనిపోయాక ఆ స్కూల్ ని మేము నడపలేకపోయాం. ఆ తర్వాత నాన్న ఫ్రెండ్ వసుంధర గారు అని ఆమె స్కూల్ ని టేకోవర్ చేసి నడిపిస్తున్నారు. ప్రతీ సంవత్సరం ఒక 30 మంది పిల్లలవరకు స్టడీస్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి వెళ్తుంటారు. కొంతమంది అసలు నా పేరు కూడా తెలీదు. నాకు భగత్ సింగ్ అంటే ఇష్టం..ఆయన బయోపిక్ వస్తే ఆ రోల్ చేయాలని ఉంది. అలాంటి పవర్ ఫుల్ స్టోరీ వస్తే కచ్చితంగా చేస్తాను.. " అని చెప్పాడు గోపీచంద్.
![]() |
![]() |